
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఏకపక్షంగా ఎగరాలని దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ పిలుపునిచ్చారు. దర్శి LP రోడ్లోని టిడిపి కార్యాలయంలో యువ నాయకులు డా కడియాల లలిత్ సాగర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ టిడిపి అధ్యక్షులతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు.రెండేళ్ల కూటమి పాలనలో ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కస్తూరిబాయ్ బాలికల నూతన భవనం, ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం, డిగ్రీ కాలేజ్ భవనం, అన్నా క్యాంటీన్, రూ.130 కోట్లతో శాశ్వత తాగునీటి ప్రాజెక్ట్ వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.గతంలో 20 వార్డులుగా ఉన్న దర్శి మున్సిపాలిటీని 28 వార్డులుగా విస్తరించామని, త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించేలా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా పనిచేయాలని డా గొట్టిపాటి లక్ష్మీ పిలుపునిచ్చారు.