
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల ప్రకారం మరియు గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారి ఆదేశానుసారం మే 1 నుండి 31 వరకు జిల్లావ్యాప్తంగా వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించబడుతున్నాయి. ఈ శిబిరాలకు సంబంధించి ఆన్లైన్ ద్వారా మొత్తం 1229 మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారు.ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన క్రీడాకారులకు మాత్రమే క్రీడా సామగ్రి మరియు డైట్ అలవెన్స్ అందజేస్తున్నామని అధికారులు తెలిపారు. పౌష్టికాహారం నిమిత్తం మొత్తం 55 క్యాంపులకు గాను ప్రతి క్రీడాకారుడికి రోజుకు రూ.6 చొప్పున అందజేయబడుతోంది.రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అన్ని క్యాంపులకు ఇప్పటికే క్రీడా సామగ్రి పంపిణీ చేయబడింది. ప్రస్తుతం నిర్వహించబడుతున్న ప్రధాన క్యాంపులు :
ఒంగోలు – ఆర్చరీ, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, వుషూ, ఫెన్సింగ్, బ్యాడ్మింటన్, కబడ్డీ (4 క్యాంపులు), స్విమ్మింగ్, స్కేటింగ్, కరాటే, సిలంబం, సెపక్ తక్రా, బాక్సింగ్
కొత్తపట్నం మండలం – వాలీబాల్, క్రికెట్ సింగరాయకొండ – టెన్నికోయిట్ ప్రస్తుతం అన్ని శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, అన్ని క్యాంపులకు క్రీడా సామగ్రి మరియు డైట్ అలవెన్స్ అందజేసినట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి జి. రాజరాజేశ్వరి తెలిపారు.