
తొలి శుభోదయం న్యూస్ గూడూరు:-
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ అభిమానులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు శంకర్ రెడ్డి మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, త్వరలో రాజకీయాల్లోకి రావాలని, ఆయన అభిమానులుగా ఆశిస్తున్నామన్నారు. సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ లోని వృద్ధులు మహిళలు ట్రస్టు నిర్వాహకులు జూనియర్ ఎన్టీఆర్ కి ఆశీస్సులు తెలియజేశారు.