
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసిన డిగ్రీ మొదటి సంవత్సరం, మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో కందుకూరు శ్రీ వివేక డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో విజయదుందుభి మోగించారని కళాశాల ప్రిన్సిపాల్ అబ్బూరి వెంకటేశ్వర్లు ప్రకటించారు.విభాగాల వారీగా .. బీసీఏ విభాగంలో అమృత – 98% (ప్రథమ స్థానం) వెంకటలక్ష్మి కుసుమ – 93% (ద్వితీయ స్థానం)సుబీన్ – 92% (తృతీయ స్థానం), బీకాం విభాగంలో అర్షియా – 88% (ప్రథమ స్థానం) ఆయుష – 85% (ద్వితీయ స్థానం), యశోద – 82% (తృతీయ స్థానం)బీఎస్సీ విభాగంలో ప్రీతి – 89% (ప్రథమ స్థానం)కె. సాయి వెంకట కీర్తి – 87% (ద్వితీయ స్థానం)జి. స్రవంతి – 85% (తృతీయ స్థానం) లు సాధించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా బి.ఆర్.ఆక్స్ ఫర్డ్ విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర రావు మాట్లాడుతూ అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారిని తీర్చిదిద్దిన లెక్చరర్లను ప్రత్యేకంగా అభినందించారు.విద్యాసంస్థల కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాబోయే విద్యాసంవత్సరం నుండి బీకాం (B.Com) తో పాటు A.C.C.A ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామును శ్రీ వివేక డిగ్రీ కళాశాలలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగా చేరబోయే విద్యార్థులు ఈ అంతర్జాతీయ స్థాయి కోర్సును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్లు జి.బాలభాస్కర రావు, బి.నరేంద్ర బాబు, అకాడమిక్ ఇంచార్జ్ డి.శ్రీనివాసులు మరియు అధ్యాపక సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.