
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గురువారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో పోలీస్ అధికారులు, సిబ్బందికి హైపర్‌టెన్షన్ (రక్తపోటు)పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి యోగా, మెడిటేషన్ కార్యక్రమాలు నిర్వహించి ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన పలు సూచనలు అందించారు.ఒంగోలు ఏఆర్ డీఎస్పీ కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ యోగా, మెడిటేషన్ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పోలీస్ విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. క్రమబద్ధమైన జీవనశైలి, సరైన నిద్ర, సమతుల ఆహారం, నిత్య వ్యాయామం ద్వారా రక్తపోటును నియంత్రించుకోవచ్చన్నారు.ఒంగోలులో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ శ్రీరామచంద్ర మిషన్‌కు చెందిన భాస్కర్ రెడ్డి మరియు ఏ. విజయ లక్ష్మి గార్లు మాట్లాడుతూ ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు భావోద్వేగ నియంత్రణ, ఏకాగ్రత పెరుగుతాయని తెలిపారు. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానానికి కేటాయించడం ద్వారా ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవచ్చని సూచించారు. అలాగే సానుకూల ఆలోచనా విధానం, సంకల్పశక్తి మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చన్నారు.పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో మానసిక ఆరోగ్యాన్ని కూడా సమానంగా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. నిరంతర ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా రక్తపోటు వంటి సమస్యలను ముందుగానే గుర్తించి నియంత్రించవచ్చని తెలిపారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ లు రమణారెడ్డి, ఆర్ఎస్సైలు ప్రసాద్, మాల్యాద్రి, తిరుపతి స్వామి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
