
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తున్న మార్కాపురం జిల్లా పోలీసులు ‘స్కై ఐ ప్రకాశం’ ప్రాజెక్ట్ కింద పీసీపల్లి మండలంలోని మారెళ్ల గ్రామంలో డ్రోన్ పర్యవేక్షణ చేపట్టారు.డ్రోన్ కెమెరాల సహాయంతో గ్రామ పరిసర ప్రాంతాలు, కీలక ప్రదేశాలు, అనుమానాస్పద కదలికలు మరియు భద్రతా పరిస్థితులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేస్తూ నేరాల నివారణ చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడంతో పాటు అనుమానాస్పద కార్యకలాపాలను ముందుగానే గుర్తించి అరికట్టేందుకు ఇలాంటి టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ చర్యలు కొనసాగుతాయని మార్కాపురం జిల్లా పోలీసులు తెలిపారు.