
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు నియోజకవర్గంలోని పేద ప్రజల ఆరోగ్యం పట్ల మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఒక వరప్రసాదంలా మారుతోంది. కందుకూరు పార్టీ కార్యాలయంలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు రూ. 23.2 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో సాయం అందక ఇబ్బంది పడిన పరిస్థితులను చూశాం. కానీ నేడు మన కూటమి ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందిస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్ల కోసం కేవలం 24 గంటల్లోనే LOC లెటర్లు అందించి ప్రాణాలను కాపాడుకుంటున్నాం.ఇప్పటివరకు మన నియోజకవర్గంలో 1313 మందికి రూ. 10.42 కోట్ల మేర ఆర్థిక సాయం అందించడం నాకు ఎంతో తృప్తినిస్తోంది. పేదల ముఖాల్లో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు సాగుతాం.