
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
పోలీసు సిబ్బందిలో మానసిక ఆరోగ్యం, ఒత్తిడి నిర్వహణ, ఏకాగ్రత మరియు సంపూర్ణ శ్రేయస్సును పెంపొందించే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు మూడవ రోజు శుక్రవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీసు సిబ్బందికి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ (హృదయపూర్వక ధ్యానం) శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లలో ఈ తరగతులు జరుగుతున్నాయి.పోలీసులు నిత్యం ఒత్తిడితో కూడిన విధుల్లో నిమగ్నమై ఉంటారని, మానసిక మరియు శారీరక ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి ధ్యానం ఒక మంచి మార్గమని ఏఆర్ డీఎస్పీ కె. శ్రీనివాసరావు గారు తెలిపారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లభించడంతో పాటు, సంపూర్ణమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవచ్చనే సదుద్దేశంతో ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడతాయన్నారు.ఒంగోలులో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ శ్రీరామచంద్ర మిషన్‌కు చెందిన భాస్కర్ రెడ్డి మరియు ఏ. విజయ లక్ష్మి గార్లు నేతృత్వంలో శిక్షణ తరగతులు జరిగినాయి. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు భావోద్వేగ నియంత్రణ, ఏకాగ్రత పెరుగుతాయని తెలిపారు. పోలీస్ సిబ్బందికి ధ్యాన పద్ధతులపై శిక్షణ అందించి, ధ్యానం వల్ల కలిగే మానసిక మరియు శారీరక ప్రయోజనాలను వివరించారు. పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో మానసిక ఆరోగ్యాన్ని కూడా సమానంగా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ లు రమణారెడ్డి, ఆర్ఎస్సైలు ప్రసాద్, మాల్యాద్రి, తిరుపతి స్వామి, APSP 7th బెటాలియం,ఈగల్ సిబ్బంది మరియు సిబ్బంది పాల్గొన్నారు.
