
తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
దర్శి ఎన్టీఆర్ పల్లెవనం పార్కును సందర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు వాకర్స్‌తో కలిసి వాకింగ్ చేశారు. పార్కులో వాకర్స్‌కు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, మహిళలు రాత్రి వేళల్లో సురక్షితంగా వాకింగ్ చేసేలా ఎలక్ట్రికల్ లైట్లు ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు.పార్కులో జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మొక్కలను నాశనం చేస్తున్న ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.వాకర్స్ సౌకర్యార్థం వాటర్ కూలర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి వారం పార్కును సందర్శిస్తూ అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని పేర్కొన్నారు.