
తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న టిడిపి క్యాడర్ శిక్షణా తరగతుల్లో భాగంగా శనివారం యూనిట్ ఇంచార్జిలకు దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు శిక్షణ అందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లో సూపర్ హిట్ అయ్యాయని, వాటిని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని యూనిట్ ఇంచార్జిలకు సూచించారు.
అలాగే కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో ముఖ్యమంత్రి N. Chandrababu Naidu, ఐటీ & విద్యాశాఖ మంత్రి Nara Lokesh గార్ల నాయకత్వంలో అమరావతి, పోలవరం నిర్మాణాలు, యువతకు 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో రాష్ట్ర అభివృద్ధి దిశగా జరుగుతున్న కృషిని ప్రజలకు వివరించాలని తెలిపారు.అదే స్పూర్తితో ప్రతి యూనిట్ ఇంచార్జి తమ తమ నియోజకవర్గాలు, గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.