
తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావేదిక’ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ మంగళగిరిలో నిర్వహించిన ఈ గ్రీవెన్స్ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు హాజరై భూ వివాదాలు, పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాలు, ఉద్యోగాలు, వైద్య సహాయం వంటి సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా నేతలు ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.“ఇది కేవలం మాటల ప్రభుత్వం కాదు… ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేసే ప్రజా ప్రభుత్వం” అని Dr. గొట్టిపాటి లక్ష్మీ పేర్కొన్నారు.