
పోలీసు సిబ్బంది, డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్ లతో విస్తృతంగా తనిఖీలు
జిల్లా వ్యాప్తంగా కొత్త వ్యకులను, అనుమానితులను గుర్తించటకు స్పెషల్ డ్రైవ్ ముమ్మరం
ఎవరైనా నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
జిల్లాలో నేరాలు నియంత్రణ, శాంతి భద్రతలను పరిరక్షించేందుకు మరియు అసాంఘిక శక్తుల కదలికలను నిరోధించేందుకు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారి ఆదేశాల మేరకు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పడి ముఖ్యమైన కూడళ్లలో, రహదారులపై వాహనాలు, పలు ఇళ్లల్లో, శివారు ప్రాంతాల్లో, హైవేలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, గ్రామ శివారులలో, లాడ్జి, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు మరియు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను విచారించారు.ఈ తనిఖీలో కొత్త వ్యక్తుల యొక్క వివరాలు ఆరా తీసి అనుమానిత వ్యక్తులని ప్రశ్నిస్తూ ఎటువంటి నేరాలు జరగకుండా జిల్లా పోలీసులు పటిష్టమైన నేర నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన యెడల చట్టాన్ని అతిక్రమించి దౌర్జన్యాలు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ డివైస్ అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసారు. ఈ తనిఖీల్లో సరైన లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, మాడిఫైడ్ సైలెన్సర్లు, త్రిబుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్ వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్లకు తరలించి ఈ చలానా విధించారు.జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా మరియు ప్రజల యొక్క భద్రతను కల్పించుటకు ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడం, అనుమానితులను తనిఖీ చేయటం, నేరాలను నియంత్రించడం ముఖ్య ఉద్దేశ్యమని, నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, అక్రమ కార్యకలాపాలను అడ్డుకట్ట వేయటం కొరకు ఈ తనిఖీలు పోలీసులు నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు నేరాల నియంత్రణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,పరిసరాల్లోకి వచ్చే కొత్త వ్యక్తుల వివరాలు తెలుసుకోవడం అవసరమని, అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అవగాహన కల్పించారు.
ప్రజల భద్రత, నేర నియంత్రణ దృష్ట్యా ఈ తనిఖీలు నిర్వహించామని, చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త వ్యక్తులు మరియు అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గుర్తిస్తే వెంటనే డయల్ 112/100 కు లేదా స్ధానిక పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారమివ్వాలని పోలీసులు తెలియచేసినారు.