
తొలి శుభోదయం న్యూస్ కంభం :-
మార్కాపురం జిల్లా కంభం మండలం ఉదయగిరి బృందావనం కల్యాణ మండపం ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన కంటి గుండె ఆర్థోపెడిక్ మరియు స్త్రీల వ్యాధుల ఉచిత మెడికల్ క్యాంపుకు భారీ స్పందన వచ్చింది. స్థానిక అడ్వకేట్ ఉదయగిరి మల్లికార్జునరావు వారి ఆధ్వర్యంలో శాంతిరాం కంటి ఆసుపత్రి కర్నూలు వారిచే ఉచిత కంటి మరి గుండె ఆపరేషన్ల శిబిరం మరియు మృదుల మోహన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మార్కాపురం వారిచే కంభంలోని ఉదయగిరి బృందావనం కల్యాణ మండపంలో ఈరోజు ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపుకు ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఈ క్యాంప్ లో శాంతిరాం ఆసుపత్రి కర్నూలు వైద్య సహాయ నిపుణులు బి.నాగార్జున, వెంకట్ కంటి పరీక్షలు నిర్వహించారు.ఇంకా అవసరమైన వారికి కార్డియాలజి సహాయ నిపుణులు శౌర్య, ప్రీతి గుండెకు సంబంధించిన బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు చేశారు. సుమారు 75 మందిని పరీక్షించి 25మందికి కంటిలో అద్దం అమర్చే IOL ఆపరేషన్లు ఉచితంగా చేయడానికి కర్నూలు శాంతిరాం కంటి ఆసుపత్రికి ప్రత్యేక బస్సులో తీసుకు వెళ్లారు. గుండెకు సంబంధించిన 35 మంది రోగులకు ప్రత్యేక తేదీలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ ఉచిత క్యాంపులో మృదుల మోహన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మార్కాపురం ఎముకలు కీళ్ళు నరాల స్పెషలిస్ట్ డాక్టర్ మోహన్ సాయికృష్ణ యామా రోగులను పరీక్షించి ఎముకలు కీళ్ళు నరములకు సంబంధించిన నొప్పుల ఆయింట్మెంట్లు , నొప్పుల స్ప్రేలు, ఎముకల కీళ్ల నరముల మందులు ఉచితంగా అందజేశారు. స్త్రీల వ్యాధుల స్పెషలిస్ట్ సంతాన సాఫల్య నిపుణురాలు గైనకాలజిస్టు డాక్టర్ మృదుల నాయుడు గోదాసు స్త్రీల వ్యాధుల రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ క్యాంప్ కు మొత్తం 300 ల మంది ప్రజలు పాల్గొని తమ వ్యాధులకు పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్యాంప్ లో లాయర్ ఉదయగిరి. మల్లికార్జునరావు, ఉదయగిరి తిరుపతమ్మ, లంకా నరసింహారావు, కాల్వ బాలరంగయ్య, సందు నారాయణ, పగిడి వెంకట రమణ, యర్రంశెట్టి బాలయ్య, పాలబత్తిని శ్రీనివాసులు,ఉదయగిరి వెంకటేశ్వర్లు,శ్రీరామ్ వెంకటేశ్వర్లు, మన్నెపల్లి తేజ, కాల్వ కార్తీక్,చిన్నకేశవుల రమేష్ లు తమ సహకారాన్ని అందించారు.ఈ ఉచిత మెడికల్ క్యాంపుకు వచ్చిన ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లు, భోజనాలు వసతి కల్పించారు. ఈ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించిన ఉదయగిరి బృందావనం కల్యాణ మండలం నిర్వాహకులకు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.