
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:-
ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న హైబ్రిడ్ మహానాడు విజయవంతానికి కోవూరు నియోజకవర్గంలో చేపట్టిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించాను. రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్ కేంద్రాల్లో మహానాడు నిర్వహించనున్న నేపథ్యంలో, కోవూరు నియోజకవర్గ పరిధిలో 11 క్లస్టర్లలో ప్రత్యేక వేదికలను సిద్ధం చేశాము.“స్త్రీ శక్తి మహానాడు” థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ మహానాడులో పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్‌చార్జ్‌లు, గ్రామ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాను.ప్రతి మహానాడు వేదిక వద్ద పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు స్వర్గీయ ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పిస్తూ పసుపు పండుగను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించాను.