
తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :-
రాష్ట్ర అఖిల గాండ్ల తెలికుల సంక్షేమ సంఘం వారు ప్రతిభ విద్యార్దులను పోత్సహించడం అభినందనీయం… వారి ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరులోని మిని బైపాస్ రోడ్డు లోని కళ్యాణ మండపంలో నిర్వహించిన స్వర్గీయ శ్రీ గ్రోసు గోపాలయ్య మెమోరియల్ గోల్డ్ మెడల్ బహుమతి ప్రధానోత్సవంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్నాను.రాష్ట్రస్థాయిలో మొదటి ,ద్వితీయ గోల్డ్ మెడల్ , పురస్కారాలు అంజేయడంతో పాటు జిల్లాకు ఇద్దరు చొప్పున ఎంపిక చేసి ప్రతిభా పురస్కారాలు అందజేయడం ద్వారా రేపటి భవిష్యత్తుకు పునాది వేసినట్టే.