
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ఎన్.లక్ష్మీ నాయక్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ రబియా గారి అధ్యక్షతన సోమవారం ఒంగోలు కర్నూల్ రోడ్డు ఫ్లైఓవర్ దగ్గర హాస్టల్ అడ్మిషన్స్ మీద మాస్ క్యాంపెయిన్స్ చేయడం జరిగినది. ఇందులో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మరియు టంగుటూరు మండలం లోనీ వెల్ఫేర్ అసిస్టెంట్స్ అందరూ పాల్గొనడం జరిగినది. అక్కడ ఉండే పబ్లిక్ మరియు రోజువారి వేతన కార్మికులకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నందు 3వ తరగతి నుండి PG వరకు జరుగుతున్న అడ్మిషన్స్ గురించి వివరించి, ప్రభుత్వ హాస్టల్లో ఉన్న పోషకాహారం మరియు మెరుగైన వసతి సదుపాయాల గురించి వివరించారు.