
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి చెందిన పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం వైష్ణవ నృసింహ జయంతి (సౌరమాన ప్రకారం) వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారి ప్రస్తుత కౌతకమూర్తులుగా అర్చనలు అందుకుంటున్న ఉత్సవమూర్తులను సూర్యాస్తమయం అనంతరం ఆలయ ప్రదక్షిణగా శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధికి వేంచేపు చేశారు. అక్కడ వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పంచామృత స్నపన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం ఉత్సవమూర్తులను తిరిగి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి గర్భాలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఉత్సవమూర్తులు గర్భగుడి నుండి బయటకు వచ్చి యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధికి వేంచేయడం ఈ దేవస్థానం ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగుతోంది.ఈ అరుదైన ఆధ్యాత్మిక ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు హాజరై స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందారు.