
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :-
అద్దంకి నియోజకవర్గం, కొరిశపాడు మండలంలోని పి. గుడిపాడు గ్రామంలో ఎస్సి కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు స్మశానవాటిక స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు, వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. స్మశానవాటిక స్థలాన్ని మెరక చేసి, రహదారి సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.అనంతరం ఎస్సి కాలనీని సందర్శించి ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతున్న తీరును పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్తను ఇంటి వద్దే వేరు చేయాలని ప్రజలకు సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు . స్వచ్ఛ రథం వినియోగం, ఘన వ్యర్థాల నిర్వహణపై కాలనీ వాసులకు అవగాహన కల్పించారు.