
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో ఉన్న బిలాల్ మసీదు ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేసిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత .ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి రోజే పూర్తిస్థాయిలో పింఛన్లు లబ్ధిదారులకు అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సిబ్బంది నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమములో , మున్సిపల్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.