google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు :-
గిద్దలూరు సహాయ బీసీ హాస్టల్ సంక్షేమ అధికారి హరిప్రసాద్ ఆదివారం ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా ఆయనకు ఘనంగా పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా బీసీ హాస్టల్ సంక్షేమ శాఖ అధికారిని నిర్మల జ్యోతి ఆయనకు పదవీ విరమణ వీడ్కోలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పలువురు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, సిబ్బంది మాట్లాడుతూ హరిప్రసాద్ 35 సంవత్సరాల పాటు నిజాయితీ, క్రమశిక్షణతో సేవలందించారని కొనియాడారు. శాఖ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ అభినందనలు తెలియజేసి పదవీ విరమణ వీడ్కోలు పలికారు.
అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. పదవీ విరమణ అనంతరం ఆయన ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు.