
తొలి శుభోదయం న్యూస్ :-
ఇటీవల కడప జిల్లాలోని ప్రొద్దుటూరు లో నిర్వహించిన ఓపెన్ నేషనల్ తైక్వాండో పోటీలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారని రాష్ట్ర వైస్ప్రెసిడెంట్ మరియు జిల్లా కార్యదర్శి అబ్దుల్ సలాం తెలియజేశారు. పథకాలు సాధించిన క్రీడాకారులు వివరాలు : బాలికల విభాగంలో జూనియర్ : అండర్ 44 కేజీ కేటగిరీలో సమ్రీన్ సుల్తాన సిల్వర్ మెడల్ సాధించింది. కేడెట్ విభాగంలో : అండర్ 42 కేజీ కేటగిరీలో పి.తేజ అక్షయ సిల్వర్ మెడల్ సాధించింది. బాలుర విభాగంలో సీనియర్ విభాగంలో అండర్ 87 కేజీ విభాగంలో పీ.విశ్వకాంత్ బ్రాంజ్ మెడల్ సాధించాడు. కేడెట్ విభాగంలో వివిధ కేజీలలో పీ.సాయి శ్రీ వాత్సవ్ మరియు డి. త్రినాథ్ బ్రాంజ్ మెడల్ సాధించారు. సబ్ జూనియర్ విభాగంలో వివిధ కేజీలలో పథకాలు సాధించినవారు Sk. సుఫియాన్ Sk. అఫ్రాన్ V.బాలాదిత్య S. లక్షదీప్ సాయి రెడ్డి P.దేవాన్ష్ లు బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ క్రీడాకారులకు శిక్షకుడిగా వ్యవహరించిన పి.అఖిల్ ను మరియు క్రీడాకారులను తైక్వాండో జిల్లా అధ్యక్షులు ఉన్నo.వీరస్వామి మరియు చైర్మన్ గోనుగుంట.వెంకటేశ్వర్లు (తిమోతి) జిల్లా కార్యదర్శి అబ్దుల్ సలాం అభినందించారు..