
జిల్లాల పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు డాక్టర్లచే స్క్రీనింగ్, పలు వైద్య పరీక్షలు నిర్వహణ.
ఆరోగ్యమే మహాభాగ్యం… అందరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: జిల్లా ఎస్పీ
పోలీసులు ఆరోగ్యంగా, ఫిట్ నెస్ తో ఉంటనే కుటుంబం, సమాజం బాగుంటుంది.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం, మార్కాపురం పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, క్యాన్సర్ పరీక్షలతో పాటు ఇతర వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించి, తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా గౌరవనీయ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఒంగోలు పట్టణంలోని ఉపాస్ హాస్పిటల్లో, ఉపవాస హాస్పిటల్ మరియు క్యాన్సర్ రహిత భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఉచిత మెడికల్ క్యాంపులో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, పోలీస్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం అత్యంత ముఖ్యమన్నారు. క్యాన్సర్ అనేది ప్రమాదకరమైనదని, ఇటీవలి కాలంలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో దానిని తగ్గించేందుకు అనేకచోట్ల మెడికల్ క్యాంపులు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారని, ఇందులో భాగంగా సాధారణంగా అధిక వ్యయంతో నిర్వహించే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఇక్కడ ఉచితంగా అందిస్తున్నామని, పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరంతర విధులు, మానసిక ఒత్తిడి, అసమయ భోజనం, నిద్రలేమి వంటి కారణాల వల్ల సిబ్బంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ సిబ్బంది దేహదారుఢ్యంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మరింత సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని, పోలీసులు ఆరోగ్యంగా, ఫిట్ నెస్ తో ఉంటనే కుటుంబం, సమాజం బాగుంటుందన్నారు.ఈ మెడికల్ క్యాంపులో మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్, పాట్ స్మియర్,బీపీ, షుగర్ & థైరాయిడ్, జనరల్ సర్జరీ, ఈసీజీ, జనరల్ మెడిసిన్, మొదలైన విభాగాలకు చెందిన నిపుణులైన డాక్టర్లు పలు వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్స చేసి మెడిసిన్ అందించారు. ఉపాస్ హాస్పిటల్ యాజమాన్యం పోలీసుల సంక్షేమాను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేశారని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు. ఈనెల మూడు నాలుగు తేదీలలో జరుగుతుందని రెండు రోజులపాటు స్క్రీనింగ్ పరీక్షలను ఇతర వైద్య పరీక్షలు ఉపయోగించుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని అన్నారు.అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏఆర్ కానిస్టేబుల్ కనక రత్నాచారిని జిల్లా ఎస్పీ గారు పరామర్శించారు. ఇటీవల మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ హాజరత్తయ్య,ఒంగోలు వన్ టౌన్ వెంకటేశ్వరావు, ఒంగోలు రూరల్ సీఐ శేషగిరి, సింగరాయకొండ సీఐ శ్రీహరి, ఉపాస్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ లు ఉమాపతి చౌదరి, ప్రకాష్ చవల, అనీల్ కుమార్, పోకూరు శ్రీనివాసులు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
