
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
కందుకూరు నియోజకవర్గంలో పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క పేదవాడిని ఆదుకోవడమే మన కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) 36వ విడత కింద నియోజకవర్గానికి చెందిన 48 మంది లబ్ధిదారులకు రూ. 25,64,642 విలువైన ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
మండలాల వారీగా లబ్ధిదారుల వివరాలు:
గుడ్లూరు మండలం: 17 మందికి రూ. 9,02,318
ఉలవపాడు మండలం: 14 మందికి రూ. 7,86,657
వలేటివారిపాలెం మండలం: 12 మందికి రూ. 6,11,563
లింగసముద్రం మండలం: 5 గురికి రూ. 2,64,104
ఇప్పటివరకు గత 35 విడతలలో 1313 మంది లబ్ధిదారులకు రూ. 10.42 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించి, రాష్ట్రంలోనే కందుకూరు నియోజకవర్గాన్ని ముందంజలో నిలిపాం.పేదల ఆరోగ్యం, సంక్షేమం కోసం క్రమం తప్పకుండా నిధులు విడుదల చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
