
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం లో విద్యార్థులకు రుచి శుచి కలిగిన నాణ్యమైన భోజనాన్ని అందించాలని MEO 2 మరియు కోర్సు డైరెక్టర్ తన్నీరు బాలాజీ అన్నారు. స్థానిక meo కార్యాలయం లో మధ్యాహ్న భోజనం కార్మికులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న MEO 1 చెల్లీ ఆనంద రావు మాట్లాడుతూ భోజనం పాఠశాల ఆవరణ లోనే తయారు చేయాలని, విద్యార్థులందరూ భోజనం చేసేలా వంట చేయాలని అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యం లో శిక్షణ నిర్వహిస్తున్న విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ టి .రంగారావు గారు మధ్యాహ్న భోజన కార్మికులకు శిక్షణ అందించారు. ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనం లో ఖనిజాలు, విటమిన్లు , శక్తి నిచ్చే పోషకాలు ఉంటాయని, ఇవి విద్యార్థి శారీరక, మానసిక ఎదుగుదల కు తోడ్పడతాయని అన్నారు. అందువలన పోషక పదార్థాలు పోకుండా బియ్యం ఒక్కసారే కడగాలని, ఆరబెట్టాలి అని, గంజి వంచరాదని అన్నారు. అయోడిన్ ఉప్పు వాడాలని, ఫోర్టిఫైడ్ F గుర్తు ఉండే ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12, విటమిన్ ఏ, విటమిన్ డి ఉండే విధంగా మధ్యాహ్న భోజనం అందించాలని ఆయన చెప్పారు. వీటి పట్ల అవగాహన ప్రతి mdm కార్యకర్తకు అవగాహన ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో మండలం లోని మధ్యాహ్న భోజన తయారీ సిబ్బంది, డాటా అనలిస్ట్ హర్షిక, బాలకృష్ణ, సి ఆర్ పి లు శ్రీనివాస్, హరిబాబు, శ్రీనివాసాచారి, జోషి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు
