
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
కురిచేడు మండలం గంగదొనకొండ గ్రామంలో అసిస్ట్ సేవాసంస్థ, ఐ.టి.సి. వారి సహకారంతో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రంలో నిర్మించిన కాంపౌండ్ వాల్, టాయిలెట్లు, హ్యాండ్‌వాష్ ట్యాప్స్‌ను దర్శి టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో గారు, ఎంఈఓ గారు, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు గారు పాల్గొన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేస్తూ అంగన్వాడీ కేంద్రంలో మహిళలతో కలిసి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.