
తొలి శుబోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
నేరాల నియంత్రణ, నేరస్తుల గుర్తింపు మరియు ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఆధునిక ఎంఎస్‌సీడీ (MSCD) పరికరాన్ని వినియోగిస్తూ వేలిముద్రల ధృవీకరణ చేపడుతున్నారు.ప్రత్యేక తనిఖీలు, కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు, వాహన తనిఖీలు మరియు అనుమానాస్పద వ్యక్తుల పరిశీలన సందర్భంగా ఎంఎస్‌సీడీ పరికరం ద్వారా వేలిముద్రలను సేకరించి, అందుబాటులో ఉన్న పోలీసు డేటాబేస్‌తో సరిపోల్చి పరిశీలిస్తున్నారు.ఈ సాంకేతిక విధానం ద్వారా నేర చరిత్ర కలిగిన వ్యక్తులను త్వరగా గుర్తించడం, పెండింగ్ కేసుల ఛేదనకు సహకరించడం మరియు శాంతిభద్రతల పరిరక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించడం సాధ్యమవుతోందని పోలీసులు తెలిపారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.