
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
గుడ్లూరు మండలం నూతన ఎంపీడీవో గా ఈరోజు బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ మల్లికార్జున రావు ని గుడ్లూరు మండలం నేత్రపురి శ్రీరామ సేపక్ సభ్యులు కలిసి తమను తాము పరిచయం చేసుకొని గుడ్లూరులో వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి వివరించి, తదుపరి మేము చేయబోయే సేవా కార్యక్రమాలకు మేము ఆహ్వానించినప్పుడు మీరు తప్పక రావాలని ఎంపీడీవో గారిని కోరడం జరిగింది. అందుకు ఆయన ఎంతో సంతోషంగా తప్పకుండా విచ్చేస్తానని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేత్రపురి శ్రీరామసేవక్ సభ్యులు ఎంపీడీవో మల్లికార్జున రావు గారిని శాలువతో సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నేత్రపురి శ్రీరామసేవక్ నిర్వాహకులు ఎయిర్టెల్ చిన్న, గుడ్లురు మండల ఆర్యవైశ్య ఫెడరేషన్ నూతన అధ్యక్షుడు ఇన్నమూరి సుధాకర్ ఆర్యవైశ్య పెద్దలు ఇన్నమూరి గరటయ్య,గుర్రం బాబు, ఆర్యవైశ్య యూత్ గొల్ల అచ్యుత మణికంఠ, పూజిత మెడికల్స్ మనోహర్, గుడ్లూరు మండల బిజెపి అధ్యక్షులు జలగం వరుణ్ కుమార్,తెలుగు యువత అధ్యక్షులు చెన్నారెడ్డి మహేష్ తదితరులు కలవడం జరిగింది.