
రాష్ట్రంలో అర్హులందరికీ ఇల్లు అందించడానికి, పేదల సొంతింటి కల నెరవేర్చడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. నెల్లూరులో గృహనిర్మాణశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాను. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గం పరిధిలో మంజూరైన ఇళ్లు, ఇళ్ల నిర్మాణాల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నాను. అర్హులందరికీ ఇళ్లు అందాలని, నిర్మాణంలో ఎలాంటి లోపాలు రాకుండా సహకారం అందించాలని అధికారులకు సూచించాను.