
తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు శ్రీ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో కనిగిరి పట్టణంలో నిర్వహించిన డా. బి.ఆర్. అంబేద్కర్ గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్ గారు, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోల బాలవీరాంజనేయ స్వామి గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారితో కలిసి దర్శి టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే శ్రీ బీఎన్ విజయ్ కుమార్ గారు, గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు, మార్కాపురం ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య గారు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ గారు, OUDA చైర్మన్ శ్రీ షేక్ రియాజ్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ సుచిత్ర వీరయ్య గారు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.డా. బి.ఆర్. అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకుంటూ సామాజిక న్యాయం, సమానత్వం, సాధికారత దిశగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.