
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
ఒంటరిగా బిక్కు బిక్కు మంటూ ఎండలో ఏడుస్తూ నిసహాయ స్థితిలో ఉన్న రెండు సంవత్సరాల పాపా కు ఆశ్రమం కలిపించిన సంతమగులురు పోలీస్ సిబంది, ప్రకాశం జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి పి నాగమణి జిల్లా బాలల సంక్షేమ అధికారి పి. దినేష్ కుమార్ హెల్ప్ స్వచ్చంద ప్రాజెక్ట్ డైరెక్ట్ బి. వి సాగర్ జిల్లా బాలల సంక్షేమ అధికారులు చొరవతో పాపకు ఆశ్రమం కల్పిచటము జరిగింది వివరాలోకి వెళ్లగా శనివారం మధ్యాహ్నం సంతామగులురు మండలం కొప్పరాము గ్రామం లొ పాప ఒంటరిగా ఉండగా స్థానికులు పాప యెక్క దయానియ పరిస్థితి ని గమనించిన పాప తల్లితండ్రులు పేరులు గాని ఊరుపేరుగని చెప్పలేక పోవడం తో స్థానికులు సంతూమాగులూరు పోలీస్ లకు సమాచారం ఇవ్వగ సంతమగులూరు పోలీస్ సిబంది, స్థానికులు పాప యెక్క తల్లితండ్రులు బంధువులు కొరకు కొప్పారాము గ్రామాములొ చుట్టుప్రక్కల గ్రామాలలో నిన్నటి రాత్రి వరకు వెతకటం జరిగింది కానీ వారి ఆచూకీ తెలియక పోవటం తో పాప పరిస్థిని హెల్ప్ స్వచ్చంద సంస్థ ప్రాజెక్టు డైరెక్ట్ బి.వి.సాగర్ దృష్టికీ తీసుకొని వెళ్లగా ఈ విషయాన్నీ బి వి సాగర్ జిల్లా బాలల సంరక్షణ అధికారి (డి. సి. పి వో )పి. దినేష్ కుమార్ దృష్టికి తీసుకొని వెళ్ళాగా వెంటనే స్పందించిన డి. సి పి ఓ పాపా యెక్క పరిస్థిని ప్రకాశం జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారి పి నాగమణి దృషకి తసుకొనివెళ్లగా వెంటనే పాప కు ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ వైద్య పరీక్షలు నిర్వహించాలని డి సి పి ఓ కు సూచనలు చేయగా డిసిపీఓ పి దినేష్ కుమార్ పాపకు ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ లొ వైద్య పరీక్ష నిర్వహించి డాక్టర్ లు పాప ఆరోగ్యం బాగుంది అని తెలపగ సంతామగులూరు పోలీస్ మరియు కోప్పరేము అంగన్వాడీ కార్యకర్త సి హెచ్ హైమాయమ్మ సహకారం తో జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఆదేశాల మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడేఒంగోలు రాంనగర్ లోని శిశుగృహ లొ చేర్పించడం జరిగినది