
తొలి శుభోదయం న్యూస్ కంభం:-
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న యోగాంధ్ర-2026 కార్యక్రమానికి కంభం చెరువు కట్ట వద్ద ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పరిశీలించారు. యోగా సాధకులకు అవసరమైన వసతులు, భద్రత, పారిశుద్ధ్యం, వైద్య సేవలపై అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.