
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
వైబ్రేంట్స్ అఫ్ కలం జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల రహిత ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా నిర్వహించిన దండి మార్చ్ 2.0 కార్యక్రమంలో పాల్గొని డ్రగ్స్ పై అవగాహన కల్పించడంలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఆదివారం విజయవాడలో కే. బి. యన్. డిగ్రీ మరియు పీజీ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు శ్రీ టి.డి జనార్దన్ టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు ఈగల్ టీం ఎస్పి మహేష్ బాబు వై బ్రాంట్స్ ఆఫ్ కలాం వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ కలాం గారి చేతుల మీదుగా ప్రధానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు శ్రీ టి.డి జనార్ధన్ మాట్లాడుతూ.. మదకద్రవ్యాలపై ఎన్జీవోస్ చేసిన కృషిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రావినూతల జయ కుమార్ మాట్లాడుతూ .. ఈ అవార్డుకు తను ఎంపికైనందుకు ఎంతో సంతోషంగా ఉందని అవార్డు తమకు ప్రధానం చేసిన విజయ్ కలం కి ధన్యవాదాలు తెలిపారు
