
తొలి సుబోదయం న్యూస్ కందుకూరు:-
వలేటివారిపాలెం మండలం కొండసముద్రం గ్రామానికి చెందిన జనిగర్ల నారాయణమ్మకు, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) పథకం రక్షగా నిలిచింది. పేద వృద్ధురాలైన నారాయణమ్మకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో, హాస్పిటల్ లో చూపించుకోగా, గుండెకి సంబంధించి 3 చోట్ల వాల్స్ బ్లాక్ అయ్యాయని డాక్టర్లు చెప్పారు. అర్జెంటుగా గుండె ఆపరేషన్ చేయాలన్నారు.
ఆపరేషన్ కు ఆర్థిక సహాయం అందించాలని నారాయణమ్మ కుమారుడు రమేష్, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ని కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి తక్షణ వైద్య సహాయం కోసం LOC (Letter of Credit) ద్వారా 2.5 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. ఆ సహాయంతో…రెండు రోజుల క్రితం గుంటూరులోని రమేష్ హాస్పిటల్ లో నారాయణమ్మకు బైపాస్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుందని డాక్టర్లు తెలిపారు. తన తల్లి ఆపరేషన్ గురించి చెప్పిన వెంటనే, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు స్పందించి, పెద్ద మనసుతో వెంటనే LOC మంజూరు చేయించారని రమేష్ తెలిపారు. ఎమ్మెల్యే గారు చేసిన సాయం జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు.