
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు డి.ఎస్.పి ఆర్. శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఒంగోలు ఒంగోలు వన్ టౌన్ సిఐ కె.వెంకటేశ్వరరావు, ఒంగోలు టు టౌన్ ఎస్ఐ యు.పున్నారావు మరియు , తాలూకా ఎస్సైలు మొత్తం 40 మంది పోలీస్ సిబ్బంది ఒంగోలు టూ టౌన్ పియస్ పరిధిలోని బాలాజీ నగర్, బత్తులవారి గుంట మరియు పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం ‘ఆపరేషన్ వజ్రా ప్రహార్’లో భాగంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీలలో భాగంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇళ్లు, దుకాణాలు, పాత ముద్దాయిల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. 17 ద్విచక్ర వాహనం, ఒక ఆటో తనిఖీ చేయగా వాటిలో 2 పత్రాలు లేని బైకులు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.ఈ సందర్భంగా ఒంగోలు వన్ టౌన్ సీఐ గారు మాట్లాడుతూ ప్రజలు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల బానిసత్వం ఆర్థిక, కుటుంబ పరమైన సమస్యలకు దారితీస్తుందని, మత్తు పదార్థాల విక్రయం, వినియోగంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం ప్రధాన కారణమని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు ఫోన్ ద్వారా ఓటీపీలు చెప్పమని మోసపూరితంగా డబ్బులు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.ఆధార్ కార్డులను అపరిచితులకు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఆధార్ వివరాలను దుర్వినియోగం చేసి సిమ్ కార్డులు తీసుకుని నేరాలకు పాల్పడే అవకాశముందని తెలిపారు. ప్రజలతో కలిసి “మత్తుకు దూరంగా ఉండాలి – మత్తు లేని సమాజాన్ని నిర్మిద్దాం” అనే ప్రతిజ్ఞ చేయించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలు సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులు లేదా డైల్112 లేదా పోలీస్ వాట్స్అప్ నెంబర్ 9121102266 తెలియజేయాలని ప్రజలను కోరారు.ఈ తనిఖీలో ఒంగోలు తాలూకా ఎస్సై ప్రభాకర్, NG ఎస్సై మహేంద్ర, కొత్తపట్నం ఎస్సై సుధాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
