
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
ఈనెల 9న వామపక్షాల ఆధ్వర్యంలో జరగనున్న రాస్తారోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా నాయకులు కె వీరారెడ్డి ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో రాస్తారోకో కార్యక్రమం కరపత్రిక ఆవిష్కరణ సిపిఐ నాయకులు చేశారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ విదేశాంగ వ్యవహారం మె తక వైఖరి వలన దేశ ప్రజలు ఆర్థిక భారం మోస్తున్నారని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో మోదీ మెతక వైఖరి ఎందుకని అతని స్వార్థం ప్రయోజనాల కోసం యుద్ధం చేయటం వలన ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని అన్నారు. ఇలాంటి తరుణంలో భారతదేశంలో కూడా ఇంధనంలో ఇబ్బందిగా మారాయని ట్రంప్ ప్రయోజనాల కోసం మనం అతనికి మద్దతు ఇవ్వాలా? దేశ ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టాలా? అని అన్నారు. ఈ నేపథ్యంలో జరగనున్న రాస్తారోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు మాట్లాడుతూ ఇంధన వనరులపై కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారంతో అధిక భారం వేయటంతోనే ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయని, ఈ తరుణంలో ప్రజలపై మోపిన బారాలు తగ్గించాలని ప్రధాన డిమాండ్‌తో ఈనెల 9న జరగనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి పి బాలకోటయ్య, సిపిఐ సీనియర్ నాయకులు ఉప్పుటూరి మాధవరావు, లక్ష్మీనారాయణ, సిపిఐ నాయకులు శ్రీరామమూర్తి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.