google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

యర్రగొండపాలెంలో ప్రత్యేక పోలీస్ మీకోసం కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ
ప్రత్యేక పోలీస్ మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్న వై.పాలెం పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు.
వై.పాలెంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంకు 36 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో జిల్లా ఎస్పీ గారు మరియు పోలీస్ అధికారులు సోమవారం యర్రగొండపాలెంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం)’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం మరియు ఇతర ప్రాంతాల నుండి వివిధ సమస్యలతో వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను ఎస్పీ గారు స్వయంగా స్వీకరించారు. పిర్యాదుదారులతో ముఖాముఖీ మాట్లాడి వారి యొక్క సమస్యల పూర్వాపరాలను సమగ్రంగా అడిగి తెలుసుకొని, వాటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.జిల్లా ఎస్పీ గారు ఆయా ఫిర్యాదులపై సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి ఈ కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి చట్టప్రకారం విచారణ జరిపి పిర్యాదుదారులకు త్వరితగతిన న్యాయం అందించేలా చూడాలని, ప్రజాఫిర్యాదుల పట్ల నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కావున ఆ పిర్యాదులపై తీసుకున్న చర్యలపై కూడా నివేదిక ఇవ్వవలసిందిగా పోలీసు అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పోలీసు వ్యవస్థను ప్రజలకు మమేకం చేయడంలో భాగంగా ఈ ప్రత్యేక మీ కోసం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, యర్రగొండపాలెం పట్టణం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా మహిళలు, వృద్ధులు వారి సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలు పడి మార్కాపురంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి రాకుండా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. ప్రజాఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తి స్థాయి విచారణ జరిపి సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ ప్రత్యేక మీకోసం కార్యక్రమంలో ఎక్కువగా కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేదింపులు, భూ & ఆస్థి వివాదాలు మరియు ఇతర సమస్యలపై పిర్యాదులు అందాయి.ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ యు.నాగరాజు, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు,డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, త్రిపురాంతకం సీఐ అస్సం, పొదిలి సీఐ రాజేష్ కుమార్, మార్కాపురం సీఐ అల్తాఫ్ హుసేన్, యర్రగొండపాలెం ఎస్సై దేవకుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
