
పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, ప్రస్తుత స్థితిగతులపై ఆరా… పలు రికార్డుల పరిశీలన
సాంకేతిక పరిజ్ఞానంతో నేర పరిశోధన, నేర నియంత్రణకు కృషి చేయాలి.
మహిళలు, చిన్నారులు, వృద్ధులపై జరిగే నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి
మార్కాపురం జిల్లా పోలీస్ శాఖ ప్రజా భద్రత, సమస్యల పరిష్కారంలో సమర్థవంతంగా పనిచేస్తోంది: మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
పోలీస్ స్టేషన్లు మరియు సర్కిల్ కార్యాలయాల పనితీరు, సిబ్బంది నిర్వహణ, మౌలిక సదుపాయాల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయం, త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ కార్యాలయాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్టేషన్ మరియు సర్కిల్ కార్యాలయాల పరిసరాలు, కార్యాలయ గదులు, రిసెప్షన్ కౌంటర్, నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లు, ఫైళ్లు, ఇతర రికార్డులను పరిశీలించారు.అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరాలు, శాంతిభద్రతల పరిస్థితి, ఎక్కువగా నమోదవుతున్న కేసులు, వారు నిర్వహిస్తున్న విధులు తదితర అంశాలపై ఆరా తీశారు. కేసుల దర్యాప్తులో నాణ్యతను పెంపొందిస్తూ (Quality of Investigation) విచారణలను వేగవంతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న కేసులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.మహిళలు, చిన్నారులు, వృద్ధులపై జరిగే నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నేరాల నియంత్రణలో భాగంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు వంటి రద్దీ ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్‌ను మరింత పెంచాలని, వాహనాల తనిఖీలు నిర్వహించాలని, అనుమానిత వ్యక్తులను గుర్తించి విచారించాలని సూచించారు. చెడునడత గల వ్యక్తులు, పాత నేరస్థులపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఇంకా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను త్వరితగతిన డిస్పోసల్ చేయాలన్నారు.మార్కాపురం జిల్లా ఏర్పాటైన అనంతరం ప్రజలకు మరింత చేరువగా ఉండే విధంగా జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందని మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు తెలిపారు. ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించడం, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలలో భద్రతా భావన పెంపొందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టడంతో పాటు, ప్రతి పోలీస్ అధికారి ప్రజా సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు.రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా గొడవలు, వివాదాలు, కొట్లాటలు వంటి సమస్యలను చట్టబద్ధంగా, త్వరితగతిన పరిష్కరించే దిశగా పోలీసులు కృషి చేస్తున్నారన్నారు.మహిళలు, బాలికల భద్రత మరియు రక్షణ పోలీస్ శాఖ ప్రథమ ప్రాధాన్యత అని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు. మహిళలపై జరిగే నేరాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు, పాఠశాలలు మరియు కళాశాలల్లో విద్యార్థినులకు వివిధ చట్టాలు, వ్యక్తిగత భద్రత, సైబర్ నేరాల నివారణ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.అలాగే ప్రతి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా సైబర్ నేరాలు, రోడ్డు భద్రతా నియమాలు, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, చట్టాలు, శిక్షలపై అవగాహన వంటి అంశాలపై ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలకు వెంటనే స్పందించి పరిష్కారం అందించే విధంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు కూడా పోలీస్ శాఖకు భాగస్వాములు కావాలన్నారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ యు నాగరాజు, ఎస్పీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డిసిఆర్ పి ఇన్స్పెక్టర్ దేవప్రభాకర్, త్రిపురాంతకం సిఐ అస్సమ్, యర్రగొండపాలెం ఎస్సై దేవకుమార్, త్రిపురాంతకం ఎస్ఐ శివరామయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.
