
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
'యోగాంధ్ర - 2026' కార్యక్రమంలో భాగంగా ఈ ఉదయం కందుకూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ గారు, మున్సిపల్ కమిషనర్ అనూష గారు,ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తో కలిసి యోగాసనాలు వేశాము.శారీరక ధృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో దోహదపడుతుంది. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని, తద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగించాలని కోరుకుంటున్నాను. మన కందుకూరు నియోజకవర్గాన్ని ఆరోగ్యకరమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడతాయి.