google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణలో భాగంగా మార్కాపురం జిల్లా పోలీసులు గిద్దలూరు పట్టణంలో ఫుట్ పెట్రోలింగ్ మరియు వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు, బస్టాండ్లు మరియు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కాలినడకన గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచారు. అలాగే వాహన తనిఖీలు చేపట్టి వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ వినియోగం మరియు ఇతర భద్రతా ప్రమాణాలను పరిశీలించారు.అసాంఘిక కార్యకలాపాలు, చోరీలు మరియు ఇతర నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా మార్కాపురం జిల్లా పోలీసులు నిరంతరం ఫుట్ పెట్రోలింగ్, వాహన తనిఖీలు మరియు నిఘా చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.