google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కంభం :-
కంభం మండలం ఈశ్వర ఏజెన్సీస్ నందు మండల వ్యవసాయ అధికారి డి. దేవేంద్ర గౌడ్ APAIMS 2.0 యాప్ ద్వారా రైతులకు యూరియా మరియు డి.ఏ.పి ఎరువుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇకపై రైతులకి ఎరువులు పంపిణీ పూర్తిగా APAIMS యాప్ ద్వారానే జరుగుతుందని స్పష్టం చేశారు. రైతులందరూ తప్పక తమ సమీపంలోని రైతు సేవా కేంద్రంలో వేయబోయే లేదా వేసిన పంటలను నమోదు చేయించుకోవాలని, రిజిస్ట్రేషన్ చేయని సీజన్లో ఎరువుల పంపిణీ సాధ్యం కాదని తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతుల భూ వివరాలు గత ఏడాది సాగు చేసిన పంటల సమాచారం నమోదవుతుందని,ఈ ఏడాది పంట మార్పిడి చేసినట్లయితే కొత్త పంట వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆ వివరాల ఆధారంగా ఆయా పంటలకి అవసరమైన ఎరువుల మోతాదులు నిర్ణయించి కేటాయిస్తారని చెప్పారు.అందువల్ల రైతు సోదరులందరూ ఆలస్యం చేయకుండా ఏపీఎయిమ్స్ 2.0 ఫార్మర్ యాప్ నందు తమ రైతుసేవ కేంద్రం నందు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.