google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణ మరియు సురక్షిత ప్రయాణాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.జిల్లాలోని ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులు, పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే కోర్టులో హాజరుపరుస్తామని హెచ్చరించారు.అదేవిధంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్, సీటుబెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని, మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ప్రజల ప్రాణాల రక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు నిరంతరం ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.