
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం మొహిద్దీన్ పురం గ్రామానికి చెందిన మండల విస్తరణ అధికారి గౌరవనీయులు శ్రీ సయ్యద్ మస్తాన్ వలి గారి భౌతిక కాయానికి మార్కాపురం వైసీపీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, కంభం సర్పంచ్ పల్నాటి బోడయ్య పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇంకా పలువురు నేతలు ప్రజా ప్రతినిధులు పాల్గొని నివాళులు అర్పించారు. మస్తాన్ వలి గారికి తుది వీడ్కోలు పలికారు.