
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో NH–16 రహదారిపై పాత కలవరి ఆలయం వద్ద, ప్రకాశం జిల్లా పోలీసులు జాతీయ రహదారుల (Highway) అధికారులతో కలిసి ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వాహనదారులకు హెల్మెట్ ధరించాల్సిన అవసరం, సీటు బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలు వివరించారు. అలాగే రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించి, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చని, తమ కుటుంబాలకు సురక్షిత భవిష్యత్ అందించవచ్చని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హైవే అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది పాల్గొని వాహనదారులతో మమేకమై అవగాహన కల్పించారు.