
రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా అధికారులకు దిశా నిర్ధేశం చేసిన జిల్లా ఎస్పీ.
హెల్మెట్ ధారణ విశిష్టతను, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వలన జరిగే అనర్థాలపై వాహనదారులకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ
రోడ్డు ప్రమాదాల నివారణే మా లక్ష్యం…జీవితం విలువైనది, జాగ్రత్త వహించండి:జిల్లా ఎస్పీ
తొలి శుభోదయం ప్రకాశం:-
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారణకు బ్లాక్ స్పాట్ ప్రాంతాలపై ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి సారించారు. మంగళవారం జిల్లా ఎస్పీ మరియు నేషనల్ అధారిటీ అధికారులు కలసి NH-16 పై గల మద్దిపాడు గ్రోత్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదాలు సంభవించే బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. స్థానిక పోలీసు మరియు ఇతర శాఖల అధికారులతో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించి వారికి పలు సూచనలు తెలియచేసినారు.మద్దిపాడు మండలం, గ్రోత్ సెంటర్ వద్ద బ్లాక్ స్పాట్ ను మరియు వెల్లంపల్లి వద్ద పరిశీలించి, బ్లాక్ స్పాట్ ఉన్న ప్రదేశాల వాహనాలు యొక్క వేగమును నియత్రించేలా సుస్పష్టమైన సైన్ మరియ హెచ్చరిక బోర్డు లను, అవసరమైన చోట్ల , క్యాట్ ఐస్, కాన్వెక్స్ మిర్రర్, రేడియం బ్లింకర్స్ మరియు మలుపుల వద్ద రేడియం స్టిక్కర్స్, హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయాలని, హై వే రోడ్ పై వాహనాలు ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయకూడదని, ఏ ప్రదేశలలో ఫ్లై ఓవర్ అవసరమో గుర్తించి ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. గ్రోత్ సెంటర్ వద్ద ఫ్యాక్టీరిలో పనిచేస్తున్న మహిళలు మరియు పురుషులు బస్సుల కోసం నిలబడతామని..కాని ఇక్కడ బస్సులు ఆపకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నామని ఎస్పీ దృష్టి కి తీసుకువెళ్ళారు.వేంటనే స్పందించిన ఎస్పీ గారు ఆర్టీసి ఆర్ఎమ్ గారితో మాట్లాడి మహిళలు పడుతున్న సమస్యలను అయన దృష్టి కి తీసుకువెళ్ళారు. గ్రోత్ సెంటర్ లో మహిళలు ఇబ్బందులు పడకుండా చేయిఎత్తితే బస్సు అపేవిధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కి ఆర్టీసీ ఆర్ ఎమ్ హామీ ఇవ్వడం జరిగినది. అంతే కాకుండా అక్కడ చెత్తను పూర్తిగా తొలగించి బస్సుస్టాప్ కూడా ఎర్పాటు చేయాలని పోలీసు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అక్కడ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, ప్రయాణికులు బస్సు ఎక్కేందుకు అనుకూలంగా లేని ప్రదేశాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ పరిశీలించి, ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర పి. రాజా బాబు ఐఏయస్ కి తెలియజేశారు.హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుట వలన రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ఎక్కువమంది తలకు గాయం కావడం వల్లే చనిపోతున్నారని, చాల మందికి బ్రెయిన్ డామేజ్ అయ్యి కోమాలోకి వెళ్లడం వంటి, ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని, వాటి వలన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. హెల్మెట్ ధారణతో ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చని, కావున ప్రతి ద్విచక్ర వాహనదారుడు తమపై కుటుంబాల భద్రత, పోషణ ఆధారపడి ఉందనే విషయాన్ని గుర్తించి తప్పకుండా హెల్మెట్ ధరించి రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవాలని సూచించారు. స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు మరియు ట్రాఫిక్ నియమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా పోలీసులు మరియు ప్రజలకు అనుసంధానంగా క్రొత్తగా రోడ్ సేఫ్టీ వారియర్స్ అనే టీం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ గారు వారితో మాట్లాడి పలు సూచనలు తెలియచేసారు. జిల్లా ఎస్పీ వెంట ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, NH ప్రాజెక్ట్ డైరెక్టర్ అనిల్ కుమార్, NH టీం లీడర్ సురేష్ బాబు, ఒంగోలు తాలూకా సీఐ విజయకృష్ణ, మద్దిపాడు ఎస్సై వెంకట సూర్య మరియు సిబ్బంది ఉన్నారు.
