
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రజల రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో మార్కాపురం జిల్లా పోలీసులు పుల్లలచెరువు మండలం మరియు మల్లపాలెం జంక్షన్ వద్ద ప్రత్యేక రవాణా భద్రతా చర్యలు చేపట్టారు.NH–565కు వెళ్లే అప్రోచ్ రోడ్లలో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ కంట్రోల్ డ్రమ్ములు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జంక్షన్ పరిధిలో వాహనదారులకు స్పష్టమైన దిశా సూచనలు అందించేలా పసుపు, తెలుపు రంగుల రోడ్ స్ట్రిప్పింగ్ చేయబడింది.రాత్రి వేళల్లో జంక్షన్ స్పష్టంగా కనిపించే విధంగా బ్లింకర్ లైట్లు ఏర్పాటు చేసి, రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ చర్యల వల్ల మల్లపాలెం జంక్షన్లో ప్రమాదాలు తగ్గి, వాహనదారులు మరియు పాదచారులకు మరింత భద్రత కల్పించబడుతుందని పోలీసులు తెలిపారు.రోడ్లపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.