
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, అక్రమ కార్యకలాపాలను ముందుగానే గుర్తించి అరికట్టాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, Sky Eye Prakasam Projectలో భాగంగా పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగిరెడ్డిపాలెం గ్రామం మరియు దాని పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక డ్రోన్ నిఘా (Drone Beat Surveillance) నిర్వహించారు.ఈ డ్రోన్ బీట్ ద్వారా గ్రామ పరిసరాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలు, అనుమానాస్పద కదలికలు, నిషేధిత చర్యలు వంటి అంశాలను సమీపంగా పరిశీలించారు. డ్రోన్ టెక్నాలజీ సహాయంతో రహదారులు, ఖాళీ ప్రదేశాలు, పల్లె బయట ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి, శాంతిభద్రతలకు భంగం కలిగించే పరిస్థితులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.పోలీసులు మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా సమర్థవంతమైన నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ Sky Eye Prakasam Project ద్వారా డ్రోన్ బీట్లను మరింత విస్తృతంగా నిర్వహించి, నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజలు తమ పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించి, శాంతియుత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పోలీసులు కోరారు.