
అభివృద్ధికి ఆకర్షితులై ఇంటూరికి మద్దతు ఉలవపాడులో బలం పుంజుకున్న తెలుగుదేశం
తొలి శుభోదయం ఉలవపాడు:-
ఉలవపాడు మండలం ఉలవపాడు గ్రామానికి చెందిన 35 ముస్లిం కుటుంబాల వారు, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే పసుపు కండువాలు కప్పి ఆత్మీయంగా పార్టీలోకి ఆహ్వానించారు .ఉలవపాడు పంచాయతీ 7వ వార్డు సభ్యుడు రఫీ సహా పార్టీలో చేరిన వారంతా మొదటినుంచి వైసీపీకి మద్దతుగా ఉన్నారు. కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న నిరంతర అభివృద్ధికి ఆకర్షితులై తామంతా టిడిపిలో చేరినట్లు వారంతా తెలియజేశారు. ఇకనుంచి ఇంటూరి నాగేశ్వరరావు వెంటే నడుస్తామని, టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ఆయా కుటుంబాల్లోని మహిళలంతా కార్యక్రమానికి తరలివచ్చారు. ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా కూటమి ప్రభుత్వంలో పెద్దఎత్తున అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కొత్తగా కొత్తగా పార్టీలో చేరిన వారందరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలియజేశారు.ఉలవపాడు గ్రామానికి చెందిన పంచాయతీ వార్డు సభ్యుడు షేక్ రఫీతో పాటు 30 ముస్లిం కుటుంబాలు, ఎద్దు మాల్యాద్రి, జెట్టి కోటిరెడ్డి, వేమిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు షేక్ బాబు, వెల్డింగ్ ఖాదర్ భాషా తదితరులు పాల్గొన్నారు.
