తొలి శుభోదయం ప్రకాశం:-
జిల్లా వ్యాప్తంగా అసాంఘిక మరియు జూద కార్యకలాపాలు కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు నిఘా ఏర్పాటు చేశారు.కందుకూరు డీఎస్పీ శ్రీ సిహెచ్. వి. బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో కందుకూరు సీఐ షేక్ అన్వర్ బాషా, ఉలవపాడు ఎస్సై సుబ్బారావు, కందుకూరు రూరల్ ఎస్సైలు నిఘా ఏర్పాటు చేసి, ఉలవపాడు మండలంలోని రామాయపట్నం రిసార్ట్ వద్ద అలాగే చాకిచర్ల పెద్ద పట్టపు పాలెం గ్రామ శివారులోని రొయ్యల చెరువుల వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన కోడి పందేల బరులను ట్రాక్టర్ సహాయంతో దున్నించారు.అదేవిధంగా కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలుకూరు పంచాయతీ, పత్తిపాటివారిపాలెం గ్రామ శివారులో సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన కోడి పందేల బరిని జేసీబీ సహాయంతో తొలగించి, ఆ స్థలాన్ని దున్నించారు.గ్రామాల్లో కోడి పందాలు, గుండాట, అసభ్యకర నృత్యాలు లేదా ఏ ఇతర జూద క్రీడలు నిర్వహించరాదని, అలాగే వాటిలో పాల్గొనరాదని పోలీసులు హెచ్చరించారు. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొన్నా, ప్రోత్సహించినా లేదా నిర్వహించినా వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.