కోడిపందెం ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి 18 మందిని అదుపులోకి తీసుకున్నారు.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక పోలీసు బృందాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు (05.04.2026) టాస్క్ ఫోర్స్ సీఐ యు. సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఎస్సై సుదర్శన్, ఏఎస్ఐ మహబూబ్ బాషా మరియు సిబ్బంది కలిసి ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవరంపాడు గ్రామ పొలాల్లో కోడిపందెం స్థావరంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కోడిపందాలు ఆడుతున్న 18 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి 9 కోళ్లు, 9 మోటార్ సైకిళ్లు మరియు రూ. 19,100/- నగదు స్వాధీనం చేసుకున్నారు.
జూద క్రీడలు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే, జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లయితే వెంటనే డయల్ 112 నంబర్‌కు లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ 9121102266కు మెసేజ్ ద్వారా సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.