తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఎంఎం రోడ్ జంక్షన్‌లో ప్రకాశం జిల్లా పోలీసులు కళాశాల విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, అతివేగం నివారించడం, వాహనాలు నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించకూడదని విద్యార్థులు మరియు ప్రజలకు అవగాహన కల్పించారు.
యువత రోడ్డు భద్రతకు ఆదర్శంగా నిలవాలని, ప్రమాదాల నివారణలో వారి పాత్ర ఎంతో కీలకమని పోలీసులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *